Sunday, May 12, 2024

తెలంగాణ‌పై క‌రోనా ప‌డ‌గ‌….

వెల్లువెత్తుతున్న కేసులు
ఎంపీ రేవంత్‌రెడ్డికి పాజిటివ్‌
ఇద్దరు ఎమ్మెల్సీలకూ కరోనా
భారీగా పెరుగుతున్న కేసులు
గాంధీ… మళ్లీ కరోనా స్పెషల్‌ ఆస్పత్రి
కట్టడి చర్యలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం
కేంద్రం హెచ్చరికలతో హై అలర్ట్‌
కేసుల ఉధృతితో అనేక గ్రామాల్లో స్వీయ లాకడౌేన్‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కరోనా మళ్ళీ పడగవిప్పింది. సెకండ్‌ వేవ్‌ షేక్‌ చేస్తోంది. పాజిటివ్‌ సోకిన వారికి కూడా లక్షణాలు తీవ్రంగానే ఉంటు న్నాయి. దీంతో.. మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా సరిగ్గా ఏడాది క్రితం వాతావరణం క్రమంగా ఏర్పడుతోంది. ప్రజాప్రతినిధులు వరుసగా.. కరోనా బారినపడుతుండగా, పాఠశాలలు.. హాస్టల్స్‌ కరోనా వృద్దికేంద్రాలుగా మారాయి. కరోనా కేసుల సంఖ్య.. వందలోపుకు పడిపో యిన పరిస్థితి నుండి మళ్ళీ ప్రతిరోజూ 400 కేసులను మించి నమోదయ్యే ఆందోళనకర వాతావరణం నెలకొంది. తొలుత కరోనా లక్ష ణాలు తీవ్రంగా ఉండి.. అనేకమంది మృత్యు వాత పడగా, క్రమక్రమంగా దాని తీవ్రత తగ్గి సాధారణ జ్వరమేనని.. పెద్దగా ఇబ్బంది లేదని భావించారు. ఇపుడు సోకుతున్న కరోనా లక్ష ణాలు.. ఆరోగ్యంపై గట్టి ప్రభావాన్నే చూపుతు న్నాయని, వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగ్గా.. గురుకులాలు, పాఠశాలల్లో కరోనా తీవ్రతను గుర్తించి విద్యా సంస్థల బంద్‌కు ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. నైట్‌ కర్ఫ్యూకు సంబంధించి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. పాఠ శాలల బంద్‌ తర్వాత కూడా కేసుల ఉదృతి కొనసాగితే నైట్‌ కర్ఫ్యూపై నిర్ణ యం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వవర్గాల నుండి ఎప్పటికపుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. కేసులు పెరుగుతున్నం దున అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రులను.. మందులు, అవసరమైన పరికరాలను సిద్దంగా ఉంచాలని అధికారయంత్రాంగానికి సూచిసు ్తన్నారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌ కూడా సీఎస్‌, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పలు మార్లు సమీక్షలు నిర్వహించారు. సినిమాహాళ్ళు, షాపింగ్‌ మాల్స్‌, పార్క్‌లు కూడా మళ్ళీ బంద్‌ చేసే అవకాశముందని, నైట్‌ క్లబ్‌లు, బార్లు, పబ్‌లపై మళ్ళీ ఆంక్షలు పెట్టే అవకాశం కనబడుతోంది.
మళ్ళీ భయం
తెలంగాణలో మంగళవారం మొత్తం 412 కేసులు వెలుగు చూడగా, ముగ్గురు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్వీయనియంత్రణ లేకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం, మాస్క్‌లు ధరించకపోవడం వల్ల కరోనా మళ్ళీ పడగవిప్పింది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో మళ్ళీ గాంధీ ఆస్పత్రిని కరోనా వైద్యసేవలకు అంకితం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయిం చింది. టెస్ట్‌ , ట్రాక్‌, ట్రీట్‌ మెంట్‌ పద్దతులు అనుసరించాలని, విస్తృతంగా టెస్ట్‌లు చేయాలని కేంద్రం సూచించగా, ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్‌ల సంఖ్య భారీగా పెంచాలని నిర్ణయించింది. నగరాలు, పట్టణాలు, విద్యాసంస్థలకే కాకుండా.. పల్లెలకు కూడా కరోనా వైరస్‌ విస్తరించింది. దీంతో కేసుల ఉదృతి ఉన్న గ్రామాల్లో స్వీయలాక్‌డౌన్‌ ప్రకటించుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 15 కేసులు బయటపడడంతో.. అక్కడి ప్రజలు స్వీయలాక్‌డౌన్‌ ప్రకటించుకున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి క రోనా పాజిటివ్‌ వచ్చినట్లు ట్విట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా ప్రకటించగా, ఎమ్మెల్సీలు పురాణం సతీష్‌, దామోదర్‌రెడ్డిలకు కౌన్సిల్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో పాజిటివ్‌ నిర్దారణ కావడం, ఇతర సభ్యుల్లో ఆందోళన నింపింది. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,151 ఉండగా, కరోనా సోకి సోమవారం ముగ్గురు మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కారణంగా మృతిచెందిన వారిసంఖ్య 1,674కు చేరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే సోమవారం 103 కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా మాస్క్‌లు పెట్టుకోకపోవడం, శానిటైజర్లు వినియో గించకపోవడంతో.. కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. విద్యాసంస్థల బంద్‌ తర్వాత కరోనా కట్టడి జరుగుతుందా.. ఇదే విస్తరణ కొనసాగుతుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఉదృతంగా సాగుతుం డగా, ఏప్రిల్‌ 1నుండి 45ఏళ్ళ వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్‌ వేసుకున్నా.. జాగ్రత్తగా ఉండాలని.. ప్రభుత్వం సూ చిస్తుండడంతో సరిగ్గా ఏడాది తర్వాత.. గత మార్చిలో నెలకొన్న భయా నక వాతా వరణం కనబడుతోంది. కరోనా వల్ల అన్ని రంగాలు.. అతలాకుతలం కాగా, ఇపుడి పుడే కోలుకుంటున్న దశలో సెకండ్‌ వేవ్‌ తరుముతూ వస్తోంది. అప్రమత్తతతో దీని నుండి బయటపడకుంటే.. మరింత నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement