Tuesday, April 30, 2024

రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన‌న్ని వ్యాక్సిన్ ల‌ను అంద‌జేస్తాం … ప్ర‌భుత్వానికి భార‌త్ బ‌యోటెక్ భ‌రోసా..

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వ విజ్ఞ‌ప్తి మేర‌కు రాష్ర్ట ప్ర‌జ‌ల‌కు స‌రిప‌డా కొవిడ్ టీకాలు ఇస్తామ‌ని భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్ప‌ష్టం చేశారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల‌తో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో కొవాగ్జిన్ టీకాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు భార‌త్ బ‌యోటెక్ ఎండీతో స‌మావేశమ‌య్యాన‌ని తెలిపారు. అంద‌రికీ ఉచితంగా టీకా ఇవ్వాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో వీలైన‌న్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాల‌ని కృష్ణ ఎల్ల‌కు సీఎస్ విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు భార‌త్ బ‌యోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ర్టానికి ఎక్కువ టీకాలు ఇస్తామ‌ని కృష్ణ ఎల్ల స్ప‌ష్టం చేశారు. కాగా,రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్ర‌తి ఒక్క‌రికీ క‌రోనా టీకా ఉచితంగా ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు.. ఈ ఉచిత టీకాల కోసం టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం రూ 2,500 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ది.. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, భారత్ బయోటెక్ డైరెక్టర్ డా. సాయి ప్రసాద్ లు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement