Wednesday, May 8, 2024

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్టు.. హైదరాబాద్​లో ఘటన

జూబ్లీహిల్స్, (ప్రభన్యూస్): గంజాయి తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా, మండిపల్లి విలేజ్​కు చెందిన ఈదిగి గణేష్ గౌడ్ (23), జూబ్లీహిల్స్, కృష్ణానగర్ లోని ఏ బ్లాక్ లో నివాసం ఉంటున్నాడు.

వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం కృష్ణానగర్ గ్రీన్ బావర్చి హోటల్ గల్లీలో గంజాయితో గణేష్ గౌడ్ ఉన్నట్లు తెలుసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 1.4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement