Monday, May 13, 2024

స‌రూర్ న‌గ‌ర్ ఇండోర్ స్టేడియంలో కొన‌సాగ‌తున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు..

హైదరాబాద్ : . హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపును హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నేటి ఉద‌యం ప్రారంభంమైంది… మహబూబ్‌ నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానంలో 67.26శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌లో 3,57,354 పోలైన ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఈ ఎన్నికలకు చెందిన కౌంటింగ్‌ కేంద్రాల్లో తొలుత చెల్లని ఓట్లను గుర్తించను న్నారు. ప్రతీ రౌండ్‌లో 56వేల ఓట్లను లెక్కించ‌నున్నారు. అయితే అభ్యర్ధులు ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటం, జంబో బ్యాలెట్‌ కావడంతో వాటిని విప్పి వేరు చేసేందుకే ఎక్కువ సమయం పట్టనుంది. దీంతో కౌంటింగ్‌కు 806 మంది సిబ్బందిని నియ‌మించారు.. మూడు షిఫ్ట్ ల‌లో కౌంటింగ్ కొన‌సాగ‌నుంది. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు సిబ్బంది, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. మొదట చెల్లుబాటయ్యే ఓట్లను 25గా విభజించి కట్టలుగా క‌డుతున్నారు. ఈ తర్వాత ప్రాధాన్యతా క్రమంలో ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపు భారీ ప్ర‌క్రియ కావ‌డంతో ట్రెండ్స్ ఈ రాత్రికి గాని తెలిసే అవ‌కాశం లేదు.. ఈ స్థానంలో టి ఆర్ ఎస్ అభ్య‌ర్ధిగా సుర‌భి వాణీదేవి, బిజెపి అభ్య‌ర్ధిగా సిటింగ్ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు, కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా చిన్నారెడ్డి, స్వ‌త్రంత్ర అభ్య‌ర్ధిగా నాగేశ్వ‌ర‌రావుతో పాటు మ‌రో 67 మంది రంగంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement