Monday, April 29, 2024

ఉద్యోగ మేళా..

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని నోబుల్‌ డిగ్రీ, పీజీ కళాశాలలో ఈనెల 20వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. నోబుల్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉద్యోగ మేళాలో హెటిరో ఫార్మాస్యూటికల్స్‌లో జూనియర్‌ కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక చేసుకోనున్నారని విద్యా సంస్థల చైర్మన్‌ఆర్‌.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ ఉద్యోగాలకు బీఎస్సీలో కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌ పాసైన అభ్యర్ధులు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. వివరాల కోసం 7660900084 ఫోన్‌లో సంప్రదించవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement