Monday, May 13, 2024

Shoaib Malik : హైద‌రాబాద్ అల్లుడికి మూడో పెళ్లి..

కరాచి: హైదరాబాద్ అల్లుడైన, పాకిస్థాన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాక్‌ నటి సనా జావేద్‌ను ఆయన పెళ్లాడాడు. భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జాతో షోయబ్‌ విడిపోయారనే వార్తల నేపథ్యంలో ఆయన మరో పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫొటోలను షోయబ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పంచుకున్నాడు.

షోయబ్ 2010లో సానియాను వివాహం చేసుకున్నారు. వారికి ఒక బాబు సంతానం. అంతకు ముందు 2002లో అయేషా సిద్ధికిని వివాహమాడిన అతడు 2010లో విడిపోయి సానియాను పెళ్లాడారు. అయితే… గత కొన్ని రోజులుగా… షోయబ్ మాలిక్ సానియా మీర్జా మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వీళ్లిద్దరూ విడిపోతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజం అయిందని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement