Sunday, May 5, 2024

న‌ర్సంపేట‌లో “ఉద్యానవన పంటల పరిశోదనా కేంద్రం – ఏర్పాటుకు కెసిఆర్ గ్రీన్ సిగ్న‌ల్

నర్సంపేట రైతాంగానికి మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్ .. నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నాలుగేండ్ల కృషి ఫలితమే నేడు నర్సంపేటలో “ఉద్యానవన పంటల పరిశోదనా కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
గతంలో మిర్చి పరిశోదనా కేంద్రం ఏర్పాటు చేయాలనుకున్నప్పటికి, ఒకే పంటపై కాకుండా రైతులు భవిష్యత్ లో పంటమార్పిడి చేయాలనుకున్నప్పుడు “హర్టికల్చర్ రీసెర్చ్ సెంటర్” ద్వారా చాల పంటలు అందుబాటులో ఉండే విదంగా ఈ కేంద్రం ఉపకరిస్తుంది.. మిర్చీతో పాటు, పసుపు, కాయగూరలు, మామిడి, జామ, నిమ్మ, అరటి, అంగూర, ద్రాక్ష వంటి పండ్లతోటలు, ఆయిల్ ఫామ్ లాంటి పంటలు పరిశోదన, సీడ్ తయారుకు ఈ సెంటర్ ద్వారా అవకాశం దొర‌క‌నుంది. రాష్ట్రంలో పండే అన్ని పంటలు ఇక్కడ పరిశోదన చేసే వీలుంటుంది.. గజ్వెల్ నియోజకవర్గం ములుగులోని కొండా లక్ష్మన్ బాపూజీ హర్టికల్చర్ యూనివర్సిటికి అనుసందానంగా నర్సంపేటలో రాష్ట్ర స్థాయి హర్టికల్చర్ రిసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విదంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప‌ట్టుద‌ల‌తో నర్సంపేటలో ఈ పరిశోదనా కేంద్రాన్ని తీసుకువ‌చ్చారు.

ఈ కేంద్రం ఏర్పాటుపై ఎమ్మెల్యే పెద్దిరెడ్డి స్పందిస్తూ, సెంటర్ మంజూరుకు సహకరించిన గౌరవ సీఎం కేసీఆర్ కి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కి, జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కేంద్రం ఏర్పాటుతోసీజనల్ వ్యాధులు అరికట్టే విదంగా మన ప్రాంతంలోనే మంచి సీడ్ ఉత్పత్తికి నెలవుగా నర్సంపేట నియోజకవర్గం నిలవనుంద‌ని అన్నారు. భవిష్యత్ లో హర్టికల్చర్ రిసెర్చ్ సెంటర్ ఇక్కడ ఉండటం వల్ల హర్టికల్చర్ కళాశాల ఏర్పాటుకు అవకాశం ఉండబోతుంద‌ని వెల్ల‌డించారు. అశోక్ నగర్ లో గతంలో ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ అక్కడ అటవి స్థలం విషయంలో కాస్త ఇబ్బంది ఉండటం వల్ల నేడు నల్లబెల్లి మండలం కన్నారావుపేటలోని సర్వే నంబర్ 58లో ఈ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా జీవో.నెం.31 ను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement