Friday, February 3, 2023

Medak: గ్యాస్ సిలిండర్ పేలి.. ఇద్దరు సజీవదహనం

మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని చిన్న శివునూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు. గ్రామానికి చెందిన పిట్టల అంజమ్మ (59)తన ఇద్దరు కుమారులతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. నిన్న మనవరాలు మధు (6)తో కలిసి పెన్షన్, రేషన్ బియ్యం కోసం గ్రామానికి వచ్చింది. అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలి భారీ శబ్దం రావడంలో భయాందోళనకు గురుయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు గ్రామస్తులు, ఫైరింజన్‌ సహాయంతో మంటలు ఆర్పివేసినా ఫలితం లేకుండా పోయింది. మంటల్లో అంజమ్మతో పాటు తన ఆరు సంవత్సరాల మనవరాలు మధు సజీవ దహనమయ్యారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement