Friday, April 26, 2024

మే7న మన్యంకొండలో ఉచిత సామూహిక వివాహాలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్

మే నెల 7వ‌తేదీ మ‌న్యంకొండ‌లో ఉచిత సామూమిక వివాహాలు చేసేందుకు నిర్ణ‌యించిన‌ట్లు రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ… పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లను ప్రవేశ పెట్టారన్నారు. ఆ స్ఫూర్తి తోనే శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ – శ్రీ లక్ష్మి వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మే7న మన్యం కొండలో ఉచిత సామూహిక వివాహాలు చేయడానికి నిర్ణయించామ‌న్నారు. ఏప్రిల్ 15 ద‌ర‌ఖాస్తు చేసుకునేందకు చివరి తేదీ అని తెలిపారు. ఈ అవకాశం కేవలం మహబూబ్ నగర్ నియోజక వర్గ జంటలకు మాత్రమేన‌న్నారు. రూ.15కోట్లతో మన్యంకొండలో ఏసీ పంక్షన్ హాల్ నిర్మిస్తున్నామ‌న్నారు. భక్తులు విడిది చేయడానికి దేవాలయ ప్రాంగణంలో 18 గదులు నిర్మించామ‌న్ఆన‌రు. రోప్ వే నిర్మాణానికి టెండర్లు కూడా పిలవడం జరిగిందన్నారు. స్వామి వారి విగ్రహం కృష్ణానదిలో దొరికిందని ప్రతీతి అని.. ఆ కృష్ణ జలాలతో రోజూ అభిషికించాలనే గుట్టపై మిషన్ భగీరథ‌ పంప్ హౌజ్ నిర్మించామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement