Tuesday, May 7, 2024

గోనె సంచితో ప‌లాజో ప్యాంట్.. ఇది చాలా కాస్ట్ గురూ

యువ‌త కోసం ఎన్నో ఫ్యాష‌న్ డ్రెస్సులు మార్కెట్లోకి వ‌స్తుంటాయి. ఇప్పుడు విడుద‌ల‌యిన కొత్త ప‌లాజో ప్యాంట్ గురించి తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఓ డిజైనర్‌ తయారు చేసిన విచిత్రమైన ప్యాంట్‌ ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అదే గోనెసంచితో తయారు చేసిన పలాజో ప్యాంట్. ఆశ్చర్య పోతున్నారు కదూ.. ఇందులో ఇంకో షాకింగ్‌ విషయం ఉంది. అదేంటో తెలుసా దాని ధర. అది వింటే నోరెళ్లబెట్టాల్సిందే .సాధారణంగా వడ్లు, బియ్యం, చిరు ధాన్యాలు నింపుకునేందుకు వినియోగించే గోనెసంచి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.

వాటిని ఎక్కువగా వ్యవసాయ సంబంధిత అవసరాల కోసం వినియోగిస్తుంటాం. అయితే,ఆ సంచితో ఓ డిజైనర్‌ పలాజో ప్యాంట్‌ తయారు చేశారు. దాన్ని ఓ షాపింగ్‌మాల్‌లో డిస్‌ప్లేలో పెట్టాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా. దాని ధర వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. రూ.వెయ్యి, రూ.రెండు వేలో అయితే పర్వాలేదు. ఆ గోనె సంచి ప్యాంట్‌ ధర ఏకంగా రూ.60వేలు అంట. అయినాకూడా జనాలు ఈ ప్యాంట్‌ను ఎగబడి మరీ కొంటున్నారట.ఇందుకు సంబంధించిన వీడియోని Sachkadwahai అనే నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ పలాజోని రూ.60వేలు పెట్టి కొంటారా.. అని క్యాప్షన్‌ ఇచ్చారు. అంతే ఇంకేముంది వీడియో పోస్ట్‌ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement