Friday, April 26, 2024

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక‌…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లికి ఈ ఏడాది చివర్లో సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఒక ఎమ్మెల్యే రాజీ నామా చేసినా, చనిపోయిన సమయానికి సాధారణ ఎన్నికలకు 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉంటే ప్రజాప్ర తినిథ్య చట్టం ప్రకారం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీని ప్రకారం కంటో న్మెంట్‌ ఉప ఎన్నిక ఈ ఏడాది ఆగస్టు లోపు జరగాల్సి ఉంటుంది. అయితే అంతకుముందే కర్ణాటక అసెంబ్లి ఎన్నికలు మేలో జరగనుండడంతో వాటితో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే అవకాశాలు లేకపోలేదని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మేలో కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక జరిగితే ఆ తర్వాత గెలిచిన అభ్యర్థి పదవీ కాలం కేవలం నవంబరు దాకే ఉంటుండడంతో ఈ లోపు ఎన్నికల కమిషన్‌ ఉప ఎన్నికను నిర్వహిస్తుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.

ఈ ఏడాదే రాష్ట్ర అసెంబ్లికి సాధారణ ఎన్నికలుం డడంతో ఈ ఎన్నికలకు కాస్త ముందుగా కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక గనుక జరిగితే రాష్ట్రంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికనే అసెంబ్లి ఎన్నికతో ముడిపెట్టి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. ఇక సాధారణ ఎన్నికలకు కాస్త వ్యవధిలోనే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక గనుక జరి గితే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకే అసెంబ్లి ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించే వాతావరణం నెలకొంటుంది. ఇది సాధారణ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని పలువురు విశ్లేషిస్తు న్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో ఇటు బీఆర్‌ఎస్‌ అటు బీజేపీకి గట్టి పట్టుండడంతో ఈ ఉప ఎన్నిక కూడా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా మారే అవకాశాలుంటాయని ఆయా పార్టీలకు చెందిన నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement