Wednesday, May 1, 2024

Jd Laxminarayana :బర్రెలక్కకు అండ‌గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న నిరుద్యోగ యువతి శిరీష అలియాస్ బర్రెలక్కపై దాడి ఘటనపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. బర్రెలక్కపై జరిగిన దాడిని తప్పుపట్టారు.

ఓ యువ అభ్యర్థినిపై దాడికి దిగడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆమెకు శిరీష అలియాస్ బర్రెలక్క, ఆమె సోదరుడిపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకుని భధ్రత కల్పించాలని అన్నారు. బర్రెలక్క, ఆమె కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement