Sunday, April 28, 2024

Shirisha: నేను ఏం పాపం చేశా.. దాడులు చేస్తున్నారు… బ‌ర్రెల‌క్క‌

కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ఆమె తమ్ముడిపై కొందరు దుండగులు దాడి చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్ద కొత్తపల్లి మండలం వెనచర్లలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి బర్రెలక్క తన మద్దతుదారులతో కలిసిఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఆమె తమ్ముడిపై దుండగులు దాడి చేశారు.

ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి హాని జరగలేదు. అయితే.. దాడిని తలుచుకుని బర్రెలక్క బోరున విలపించారు. తాను ఏం పాపం చేశానని ఇలా దాడులు చేస్తున్నారంటూ కన్నీరు పెట్టుకుంది. తన తమ్మున్ని తన కళ్ల ముందే కొట్టారని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement