Sunday, April 28, 2024

Big Breaking | బండి సంజయ్​ను తప్పించడంతో అభిమాని సూసైడ్​.. లేఖ రాసి మరీ..

బీజేపీ ఎంపీ, తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేక తన అభిమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ఇవ్వాల (మంగళవారం) రాత్రి జరిగింది. ఖమ్మం అర్బన్ బీజేపీ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్​ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

బండి సంజయ్​ని బాధ్యతల నుంచి తప్పించడాన్ని తట్టుకోలేక పోతున్నా అని ఓ లేఖ కూడా రాసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని ఖమ్మంలోనొ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ​ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement