Monday, May 6, 2024

ఉద్యోగులకు అన్యాయం జరగదు – సొసైటీ స్థలాలను త్వరలోనే అప్పగిస్తాం – కె టి ఆర్

హైదరాబాద్ – ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాల విషయంలో అర్హులైన ఒక్కరికి కూడా అన్యాయం జరుగదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గచ్చిబౌలి హౌసింగ్​ సొసైటీకి సంబంధించిన భూ సమస్య పెండింగ్​లో ఉందని, గతంలో వారికి కేటాయించిన భూమి అలాగే ఉందని, ఈ భూమిని ఉద్యోగులకు పంచేందుకు సీఎం కేసీఆర్​తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

. భాగ్యనగర్​ టీఎన్జీఓ గచ్చిబౌలి హౌసింగ్​ సొసైటీ ఇండ్ల స్థలాల పరిష్కారం కోసం రాష్ట్ర ఎక్సైజ్​, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి శ్రీ. వి. శ్రీనివాస్​ గౌడ్​ ఆధ్వర్యంలో టీఎన్జీఓ కేంద్రం సంఘం అధ్యక్షులు, ఉద్యోగ జేఏసీ చైర్మన్​ మామిళ్ల రాజేందర్​, ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్​ ,, టీఎన్జీఓ అసోసియేట్​ అధ్యక్షులు ముత్యాల సత్యనారాయణగౌడ్​ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్​ నీ గురువారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ స్పందిస్తూ త్వరలోనే ఉద్యోగులకు చెందాల్సిన స్థలాలను వారికి అప్పగించేలా సీఎం కేసీఆర్​ తో చర్చిస్తామని హామీ ఇచ్చారు.

స్వరాష్ట్రంలో ఏ ఒక్క ఉద్యోగికి కూడా అన్యాయం జరుగదని, ఇప్పటి వరకు ఫ్రెండ్లీ సర్కారుగా ఉంటున్నామని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవల మంత్రి శ్రీ వి. శ్రీనివాస్​ గౌడ్​ గారు బీటీఎన్జీఓ హౌసింగ్​ సొసైటీ జనరల్​ బాడీ సమావేశానికి వచ్చి గచ్చిబౌలి హౌసింగ్​ సొసైటీ స్థలం విషయంలో మంత్రి కేటీఆర్​ ని కలిసి, సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చుకునే ప్రయత్నంలోనే గురువారం మంత్రి కేటీఆర్​ ని కలిసి అభినందనలు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్​, శ్రీనివాస్​ గౌడ్​కు సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement