Saturday, April 27, 2024

దళితబంధు పనిచేయలేదా? ప‌థ‌కం ప్రారంభించిన శాలపల్లిలోనే టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ!

టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం హుజూరాబాద్ ఉపఎన్నికలో పని చేయలేదా? ప్రస్తుతం వెడువడుతున్న ఫలితాల సరళిని చూస్తుంటే అదే నిజ‌మ‌నిపిస్తోందంటున్నారు ప‌రిశీల‌కులు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు దాదాపు 50 వేల వరకు ఉంటారు. వీరందరిపై దళితబంధు తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కానీ, టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌ అంచనాలకు విరుద్ధంగా.. దళితబంధు ప‌థ‌కం ఓటర్లను ఆకట్టుకోకపోయిందనే భావన ఇప్పడు వెలువడుతోంది. దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరి సమక్షంలో భారీ బహిరంగసభలో ఈ పథకాన్ని ఆరంభించారు. పథకానికి సంబంధించి వివరాలను ఆయనే స్వయంగా వేదికపై నుంచే అందరికీ వివరించారు. అయితే, శాలపల్లిలో వెలువడిన ఫలితాను టీఆర్ఎస్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. శాలపల్లిలో కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 135 ఓట్ల ఆధిక్యతను సాధించారు. టీఆర్ ఎస్ కు కేవ‌లం 175 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement