Thursday, April 25, 2024

బాలికపై బాబాయ్ అత్యాచారం..నిందితుడి అరెస్ట్..

గూడూరు రూరల్ ప్ర‌భాన్యూస్ : ఓ బాలికపై సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘ‌ట‌న గూడూరు రూరల్ పరిధిలోని వెందోడు గ్రామంలో చోటు చేసుకుంది.రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు వివరాల మేరకు వెండోడు గ్రామంలో నివాసం ఉంటున్న కలగంద మణి ఇంట్లో ప‌లు రోజుల నుండి అతని భార్య.. అక్క కూతురుని తల్లిదండ్రులు సమస్యల వల్ల బాలికను వారి ఇంటి వద్ద ఉంచారు.ఈ క్రమంలో బాలికకు ఆరోగ్యం బాగా లేదని, వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం బాలిక గర్భంతో ఉందని వైద్యులు నిర్ధారించారు. దీనికి కారణం సొంత బాబాయి అని తెలుసుకొని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు అందించారు..దాంతో అతనిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement