Tuesday, April 30, 2024

ధరణి తప్పులకు – ఒకరి మృతి

వరంగల్ జిల్లా : ఆరెపల్లి గ్రామనికి చెందిన పొగాకు మహేందర్ గౌడ్, గ్రామ గౌడ కుల పెద్దమనిషి. తనకు వారసత్వంగా వచ్చిన సర్వే నెం 565 లో 0.17 గుంటల భూమి ధరణిలో అదే గ్రామానికి చెందిన ఇతరుల పేరుపై రావడంతో గత సంవత్సరం నుండి MRO, కలెక్టర్, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి తన అనారోగ్యం క్షీణించి చివరగా మృతి చెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం పొగాకు మహేందర్ తనకు స్వార్జితమైన భూమి తనకు దక్కాలని, ఇద్దరు కూతుర్లకు అందాలని అణునిత్యం మధన పడుతూ అనారోగ్యానికి గురై చనిపోవడం బాధాకరం అని , ధరణి తప్పిద్ధం, అధికారుల నిర్లక్ష్యం వల్లనే పొగాకు మహేందర్ మృతి చెందాడని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేలుకొని పొగాకు మహేందర్ కు ఉండబడిన భూమిని తక్షణమే పట్టాకు ఎక్కించి, తనకు రైతు బీమా ఇప్పించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తమ పేరు ధరణిలో వచ్చినా తమకు అధికార పార్టీ నాయకుల అండ ఉందని, నీవు ఏమి చేసినా మాకేమీ కాదని పలుమార్లు మహేందర్ ను హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది. అదేవిధంగా పోలీసు స్టేషన్ లో కూడా తమ అధికార పార్టీ నాయకుల0 మాకు ఏవిధమైన కేసులు కావని పైగా నీపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించడంతో మరింత మానసికంగా కృంగి పోయి తీవ్ర అనారోగ్యానికి గురై తన తుది శ్వాస విడిచారు. హసన్ పర్తి పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదైన అధికారులు చర్యలు తీసుకోకపోవడం వలన ఈ పరిస్థితి వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికైనా ధరణీ లో మహేందర్ పేరు ఎక్కించాలని కూతర్లు వర్శిత(16), హిమశ్రీ (10) మరియు భార్య సునీత లు పట్టా పాసుపుస్తకం రైతు భీమా ఇచ్చి తమను ఆదుకోవాలని అధికారులను వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement