Wednesday, May 8, 2024

దళిత బంధు తక్షణమే ఇవ్వాలి : బీజేపీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ ఎలక్షన్ లో ల‌బ్ది పొందడం కోసం “దళిత బందు” అంటూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తామని, హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్ట్ ఎన్నికలు పూర్తయిన ఇప్పటికీ ఇవ్వకుండా ఆలస్యం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధుని అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన, ఇప్పటివరకు దళిత బంధుకి నోచుకోవడం లేకపోవడాన్ని నిరసిస్తూ, తక్షణమే అర్హులైన దళిత కుటుంబాలకి దళిత బందు కింద 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి, నిరసనగా ర్యాలీ చేస్తూ అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ కు పూలమాల వేసి దళిత బంధు రాష్ట్ర దళిత ప్రజలందరికీ చేయాలని భారతీయ జనతా పార్టీ నిజాంపేట్ కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు కుంకీ రాము ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా దళిత మోర్చా నాయకులు మాట్లాడుతూ….. కేసీఆర్ ప్రభుత్వం మరొకసారి దళితులను మోసం చేయడానికి దళిత బందు తీసుకొచ్చారని, దళితులపై చిత్తశుద్ధి లేదని, దళితులపై చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అమలు చేయాలన్నారు. గతంలో హామీ ఇచ్చి దళితులను మోసం చేసిన విధంగా, దళిత బంధు అమలు చేయకుండా మరొకసారి మోసం చేస్తే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ బీజేపీ అధ్యక్షులు ఆకుల సతీష్, ఎస్సీ మోర్చా స్కాలర్షిప్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నాగరాజు, జిల్లా ST మోర్చా అధ్యక్షులు రాంచందర్ నాయక్, బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి నరేంద్ర చౌదరి, సెక్రటరీ అనిత, కార్యవర్గ సభ్యులు నరేష్ గుప్తా, BC మోర్చా ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్ ,మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి ,జిల్లా డాక్టర్ సెల్ రాజు, సీనియర్ నాయకుడు శివన్న, అశోక్ తదితరులు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement