Wednesday, May 15, 2024

ద‌ళిత‌బంధును మేసేసిన 42 మంది చెద పురుగులు ఎవ‌రు…….

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజాగ్రహం ఉన్న భారాస సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో పలువురు మాజీ మంత్రులు, సీనియర్‌ ప్రజాప్రతినిధులు ఉన్నట్టు- తెలుస్తోంది. రాష్ట్రంలో భారాస తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజక వర్గాల్లో మంత్రులు, ఎమ్యెల్యేల పనితీరుపై ప్రతి నెల రెండు దఫాలు సర్వే జరిపించి నివేదికలు తెప్పించుకుని విశ్లేషించే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ 42 మంది సిట్టింగ్‌ల పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని, మరీ అధ్వానంగా ఉందని గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల పట్ల నియోజకవర్గ ప్రజలు అసంతృప్తిగా ఉంటే తానూ చేసేదేమి లేదని కేసీఆర్‌ ఈ భేటీ-లో అన్నట్టు- ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది చివరిన జరిగే శాసన సభ ఎన్నికల్లో ఫిర్యాదులు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి ఉన్న సిట్టింగ్‌లకు టికెట్‌ కట్‌ అన్న (పోటీ- చేసే అవకాశం ఉండక పోవచ్చు) సంకేతాలను ఆయన పరోక్షంగా ఇచ్చినట్టు- ఎమ్మెల్యేల్లో ప్రచారం జరుగుతోంది. భారాస కీలక నేత ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి కేసీఆర్‌తో అడుగులు వేసిన ఎమ్మెల్యేల్లో ఏడెనిమిది మంది పట్ల ఆయా నియోజక వర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు- తెలుస్తోంది. పనితీరు, వ్యవహార శైలి, తీసుకుంటు-న్న నిర్ణయాల పట్ల నియోజక వర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రులు, సీనియర్‌ శాసన సభ్యులు, పార్టీ పెద్దలకు సన్నిహితంగా మెలిగే వారున్నారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలని లేకుంటే ఓడిపోతామని, సరిగా పని చేయని ఎమ్మెల్యేల తోక కోస్తామని కేసీఆర్‌ ప్లీనరీ వేదికగా హెచ్చరించారు. అయితే.. 42 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించి కేసీఆర్‌ ఆ 42 మంది ఎమ్మెల్యేలు ఎవరో మీకు తెలుసునని, ఇప్పుడు వారి పేర్లను బహిర్గతం చేయడం శ్రేయస్కరం కాదన్నారు.


సమయం వచ్చినప్పుడు 42 మంది ఎమ్యెల్యేల పేర్లు ప్రకటిస్తానని కూడా కేసీఆర్‌ పేర్కొన్నట్టు- సమాచారం అంతా బాగానే ఉన్న వ్యక్తిగత కారణాలతో ఆ 42 ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు- తెలుస్తోందన్నారు. ఈ ఎన్నికలు చాలా క్లిష్టమైన వని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ నియోజక వర్గ ప్రజలు ఎమ్మెల్యేల పనితీరుతో సంతృప్తి చెందక పోతే చేసేదేమి లేదని ప్రత్యామ్నాయం చూసుకుంటానని చెప్పినట్టు- ఓ సీనియర్‌ ఎమ్మెల్యే పేర్కొన్నారు. బాగా పని చేసుకుంటే మీకే మంచిదని, లేదంటే మీకే నష్టం అని అధినేత అన్నారని ఆ ఎమ్మెల్యే పేర్కొన్నారు. వ్యక్తిగత కారణాలతోనే నియోజక వర్గాల్లో సమస్య ఉందన్న సమాచారం చెప్పారని వివరించారు.

ఏ జిల్లాలో ఎంతమంది సిట్టింగ్‌లపై అసంతృప్తి ?
సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తిగా ఉన్న నియోజకవర్గాల సమాచారాన్ని ఆంధ్రప్రభ కొంత రాబట్ట గలిగింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయా జిల్లాల అసంతృప్తుల పరిస్థితి ఇలా ఉంది. వికారాబాద్‌ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండగా ఒక నియోజక వర్గంలో మాత్రం గ్రూప్‌ తగాదాలు తారాస్థాయికి చేరినట్టు- సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే పనితీరు బాగో లేదని తేలింది. హైదరాబాద్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నట్టు- సమాచారం. కామారెడ్డి జిల్లాలో ఒకరు, నిజామాబాద్‌ జిల్లాలో ఒకరు ఈ జాబితాలో ఉన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉందని నిర్మల్‌ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే జనగాం జిల్లాలో ఇద్దరు, మహబూబాబాద్‌ జిల్లాలో ఒకరు, సూర్యాపేట జిల్లాలో ఒకరు, నల్గొండ జిల్లాలో ఒకరు, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఇద్దరు, జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకరు, కరీంనగర్‌ జిల్లాలో ఒకరు, వరంగల్‌ జిల్లాలో ఒక ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత ఉన్నట్టు- సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో ఒకరు చొప్పున శాసన సభ్యుల పట్ల వ్యతిరేకత ఉన్నట్టు- తెలుస్తోంది.

ఎమ్మెల్యేల ఉక్కిరి బిక్కిరి
పార్టీ ఎమ్మెల్యేల్లో 42 మంది పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని భారాస అధినేత కేసీఆర్‌ ప్రకటించడంతో ఆ జాబితాలో తామున్నామా అంటూ ఆయా నియోజకవర్గ శాసనసభ్యులు వాకబు చేయడం ప్రారంభించారు.ఆయా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్ళి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ- పరిశ్రమల శాఖ మంత్రి కేటీ- రామారావుతో సమావేశమైనట్టు- తెలుస్తోంది. ఆయనేమైనా ఉప్పందిస్తారేమోనని వేచి చూసినట్టు- సమాచారం. అయితే తనను కలిసిన ఎమ్మెల్యేలకు కేటీ-ఆర్‌ బాగా పనిచేసుకోమని మాత్రమే చెప్పారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement