Tuesday, May 14, 2024

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ బస్, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని హనుమకొండ నక్కలగుట్ట కాళోజి సెంటర్ లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడుతూ గత ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి పెట్రోల్ డీజల్ ధరల రూపంలో 25లక్షల కోట్ల రూపాయిలు దండుకున్నారని అన్నారు. ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. దేశం ఎందుకు ఆర్ధికంగా దివాలా తీస్తుందని అయన  కేంద్రాన్ని నిలదీశారు. మోడీ సర్కార్ ఈ దోపిడీ మనస్తత్వాన్ని వీడి, కష్ట కాలంలో వున్న ప్రజలని ఆదుకోవాలని, వెంటనే పెట్రోల్ డీజల్ గ్యాస్ బస్  ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బీజేపీ అంటే బిజినెస్ జనతా పార్టీగా మారి ప్రజల రక్తం తాగుతుందని విమర్శించారు. మోడీ సర్కార్ కేవలం వ్యాపార మనస్తత్వంతో నడుస్తుందని, క్రూడాయిల్ ధర తగ్గినప్పుడు సహజంగానే పెట్రోల్ ధర తగ్గాలి కానీ పెట్రోల్ ధర ఆకాశానికి తాకుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement