Sunday, April 28, 2024

ప్రభుత్వాసుపత్రి ఆకస్మిక తనిఖీ.. వైద్యుల నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

మహబూబాబాద్ స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కె. శశాంక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో డాక్టర్ లు లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ.పి. విభాగాల్లో సంబంధిత డాక్టర్ లు లేకపోవడంపై అసహనం  వ్యక్తి చేశారు. పద్ధతి మార్చుకొనకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది హాజర్ రిజిస్టర్ ను తెప్పించుకొని విధుల్లో ఉన్న డాక్టర్లను, సిబ్బందిని పేరుపేరునా పిలిచి హాజరును పరిశీలించారు. డాక్టర్ లు లేకపోవడం, గంట ముందే విధులను వదిలి వెళ్ళడం గమనించిన కలెక్టర్.. ప్రభుత్వం నిధులు వెచ్చించి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే, ప్రభుత్వ డాక్టర్ లు విధులు సక్రమంగా నిర్వహించక పోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెడియాట్రిక్స్,  ఆర్థో పెడిక్, జనరల్ ఓ.పి. విభాగాలను పరిశీలించారు. రిజిస్టర్ లలో ఓ.పి. సేవల వివరాలను, ఎంతమంది నమోదు అవుతున్నారని విషయాలను పరిశీలించారు. సమయపాలన పాటించాలని, సమయం కంటే ముందు ఆసుపత్రిని వదిలి వెళ్లరాదని తెలిపారు. పేషంట్ లకు సరైన సమయంలో వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, పద్ధతి మార్చుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని, లేకుంటే చర్యలు తప్పవని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement