Wednesday, December 6, 2023

నేరాల నియంత్రణ కోసం కార్డన్ సెర్చ్ – నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ (ప్రభ న్యూస్)22:ప్రజలతో సత్సంబందాల కోసం ఈ కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రా మ్ నిర్వహిస్తున్నామనీ…. నేరాల నియంత్రణకు.. కమ్యూ నిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ అన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. శుక్రవారం తెల్లవారు జామున నిజామా బాద్ జిల్లా కేంద్రంలోని 6టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని రాంనగర్, నెహ్రూ నగర్, సారంగాపూర్ కాలనీలో పోలీ సులు కార్డన్ సెర్చ్ నిర్వహిం చారు.

ఈ సందర్భంగా టౌన్ 6 పి.యస్ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా దాదాపు 150 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి వాహనాదారుల వాహ నాల డాక్యూమెంట్ల ను పరిశీలించారు.ఈ సందర్భంగాఎలాంటి కాగితాలు నంబర్ ప్లేట్ లేని మొత్తం 82ద్విచక్ర వాహనాలు, 31ఆటోలు, 2కార్లు, 2లారీలను స్వాదీనం చేసుకున్నారు.మట్కా నిర్వాహాకులు అబ్దుల్ సాజీద్, సయ్యద్ షాదుల్లా లపై మట్కా కేసు నమోదు చేశారు. రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాదీనం చేసుకొని పై కేసులు నమోదు చేశారు. ఒక మోరంతో ఉన్న లారీ నీ సీజ్ చేసి తహసీల్దార్ వారికి తదుపరి చర్యకోసం పంపారు.

- Advertisement -
   

.ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడు తూ ఇప్పటి వరకు టౌన్ 6 లోని ప్రజలతో సత్సంబందాల కోసం ఈ కమ్యూనిటి కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా వాహనా దారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, హెల్మె ట్ ధరించాలని,వాహానాల పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసే వారి ఊచ్చులో పడకూ డదని, ఎలాంటి పరిచయం లేని వారు ఆన్లైన్ ద్వారా మన సమాచారం అడిగినట్లయితే ఎవ్వరికి ఇవ్వరాదని అన్నారు. పిల్లలకు ఫోన్ లు ఇవ్వరా దని ,బ్యాంక్ నుండి మాట్లా డుతున్నామనీ మన బ్యాంక్ సమాచారం అడిగిన ఎవ్వరికి ఇవ్వరాదని, లక్కీడ్రా పేరుతో ఎవ్వరికి డబ్బు లు ఇవ్వరా దన్నారు. ఎవ్వరూ కూడా ఆన్లైన్ ఫ్రాడింగ్ మోసాలకు గురికావద్దని, ఎవ్వరయిన మోసానికి గురిఅవుతే వారు వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు సూచిం చారు. పరిచయం లేని వారికి ఇల్లు కిరాయి ఇవ్వవద్దని, కొత్త వ్యక్తులకు ఇంటిని కిరాయికీ ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకోవాల న్నారు. ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ముం దుకురావాలని, ఈ సి.సి కెమెరాల ఏర్పాటుతో నేరగాళ్ల గుట్టురట్టులో ఎంతో దోహాద పడుతున్నాయని, సి.సి కెమెరా ల వలన ఇప్పటి వరకు ఎన్నో దొంగతనాలకు పాలుపడిన నేరగాళ్లను కిడ్నాప్ కేసులో నిందితులను ఎంతో సులువు గాపట్టుకోవడం జరిగిందన్నారు. ఎవ్వరయిన తప్పుడు పనులు చేస్తున్నట్లు సమాచారం తెలిసి న వారు ముందుగా సంబంధిత పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్ర తలకు ఎవరూ విఘాతము కలిగించరాదని అన్నారు. ఎవ్వరూ కూడా గంజాయి వాడ కం చేయకూడదని, గంజాయికి సంబందించిన సమాచారాం తెలిసినట్లయితే వారు దగ్గర లోని పోలీస్ వారికి తెలియ జేయాలని అన్నారు. సైబర్ నేరాల నుండి ప్రజలు అనుని త్యం జాగ్రత్తగా ఉండాలని, లోన్ యాప్లు ఎవ్వరూ డౌన్లోడ్ చేసుకోరాదని, వాట్సప్ లేదా ఫేస్ బుక్ ద్వారా ఎవ్వరివైన ఫోటోలు ఉపయోగించి ఆపదలో ఉన్నమని డబ్బులు తొందరగా పంపుమంటే పంప కూడదన్నారు. దానికోసం ఫోన్ చేసి పూర్తి విషయాలు కనుక్కో వాలని తెలిపారు. నేరచరిత్ర కలిగిన వారు తమ ప్రవర్తనను మార్చుకోవాలని, ప్రవర్తన మార్చుకోకుంటే తగు చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమీషనర్ ( ఎల్ అండ్ ఓ )ఎస్. జయారామ్, నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, సి.ఐలు 8, ఎస్.ఐ.లు 12 మంది, ఎ.ఎస్.ఐలు, హెడ్ కానిస్టేబుల్స్,కానిస్టేబుల్స్ , మహిళా పోలీస్ , మహిళా హోమ్ గార్డులు 130 మంది పోలీస్ సిబ్బంది, నేహ్రు నగర్, రాంనగర్ సర్పంచులు అమానుల్లా, జిలానీ, ఎమ్.పి.టి.సి స్వామి కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement