Sunday, October 13, 2024

కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి గంగుల భూమిపూజ

కరీంనగర్ బై పాస్ లో గలరేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమం లోనగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్,కార్పొరేటర్లు జంగిల్ ఐలేందర్ యాదవ్, భూమా గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్,నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ మరియు గౌడ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

గణపతి మండపాల విద్యుత్ చార్జీ లను అందించిన మంత్రి గంగుల

గణేష్ నవరాత్రి వేడుకల సందర్బంగా మండపాలకు ఉపయోగించే విద్యుత్ చార్జీలను రాష్ట్ర బి సి సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెల్లించారు. శుక్రవారం టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ కరీంనగర్ ఎస్ ఈ కి 4 లక్షల రూపాయలచెక్కును అందించారు. గణేష్ నవరాత్రి వేడుకలను, నిమజ్జన కార్యక్రమాన్ని సోదర భావంతో శాంతియుతంగా జరుపు కోవాలని మండపాల నిర్వాహకులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో జెడ్ పి చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి చైర్మన్ రుద్ర రాజు, బి ఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement