Wednesday, December 6, 2023

నిన్న తొడ కొట్టుడు – నేడు ఈల వేయుడు… అసెంబ్లీ లో బాలయ్య దూకుడు

అమరావతి – హీరో , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో యాక్టివ్‌ అయిపోయారు.. గతంలో అవసరం అయినప్పుడు తప్పితే.. సభకు వచ్చారా? వెళ్లారా అన్నట్టుగా ఉండే బాలయ్య.. తన బావ, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత గేర్‌ మార్చేశారు.. సభలో నిరసన తెలుపుతున్నారు.. స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లే ఆందోళన చేస్తున్నారు.. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు… అధికార పక్షానికి వ్యతిరేకంగా స్లోగన్స్‌ ఇస్తున్నారు. విపక్ష నేతలు రెచ్చగొడితే మీసాలు మెలేసి కౌంటర్‌ ఇస్తున్నారు.. తొడగొట్టి వార్నింగ్‌ ఇస్తున్నారు..

- Advertisement -
   

అంతే కాదు.. ఈరోజు అసెంబ్లీలో విజిల్స్‌తో హోరెత్తించారు.. ఇలా మొత్తంగా టీడీపీ సభ్యుల ఆందోళన సమయంలో నందమూరి బాలకృష్ణ గురించే ఎక్కువ చర్చ సాగుతోంది.. టీడీపీ సభ్యులకు కౌంటర్‌ ఇస్తూ మాట్లాడుతున్న ప్రతీ మంత్రి, అధికార పార్టీకి చెందిన నేతలు బాలకృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడడం లేదు. బాలయ్య కు కౌంటర్ ఇచ్చేందుకు అధికార పక్ష సభ్యులు ఎక్కువ సమయం కేటాఇస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement