Monday, April 29, 2024

జాతీయస్థాయి ఉత్తమ సర్పంచ్ నాగేశ్వరరావుకు కలెక్టర్ జితేష్ పాటిల్ సత్కారం

బీర్కూర్ ఏప్రిల్ 28ప్రభ న్యూస్: బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామ సర్పంచ్ మద్దినేని నాగేశ్వరరావు జాతీయస్థాయిలో ఉత్తమ సర్పంచ్ గా ప్రశంస పత్రం అందుకున్నారు. జాతీయస్థాయిలో రైతు నగర్ గ్రామంలో హరితహారం, ఇతర కార్యక్రమాలలో సర్పంచ్ పనితీరుకు రాష్ట్రపతి సెక్రెటరీ నుండి ప్రశంస పత్రం రావడంతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ జితేష్ పాటిల్ చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ మద్దినేని నాగేశ్వరరావు ను సత్కరించి, ప్రశంస పత్రం అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement