Sunday, May 19, 2024

బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం- కలెక్టర్ కృష్ణ ఆదిత్య

మంగపేట ( ప్రభ న్యూస్ ) : శనగకుంట అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య హామీ ఇచ్చారు. ములుగు జిల్లా మంగపేట మండలం నరసింహ సాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని శనిగకుంట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్ళ‌ని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటునాగారం ఏఎస్పి అశోక్ కుమార్ లు పరిశీలించారు. బాధిత కుటుంబాలతో, గ్రామస్తులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. రెవిన్యూ డిపార్ట్మెంట్, ఐ డి డి ఎ ల ద్వారా బాధిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పునరావాసం ఏర్పాటు చేస్తామని, తాత్కాలికంగా నివాసం ఉండటానికి ఏర్పాట్లతో పాటు నిత్యావసర సరుకులు అందజేస్తామని హామీ ఇచ్చారు. అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు యువకుల స్టడీ సర్టిఫికెట్లు మెమోలు కాలిపోయిన ఇంట్లో తెలిసిందని, సంబంధిత కాలేజీలు యూనివర్సిటీల వారితో మాట్లాడి వాళ్లకు తిరిగి సర్టిఫికెట్లు మెమోలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శనగ కుంటలో ఏర్పాట్లను పరిశీలించిన వలసిందిగా జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య, మంగపేట మండల స్పెషల్ ఆఫీసర్ తుల రవి, తహసిల్దార్ సలీం పాషా, ఎంపీడీవో కర్ణాటి శ్రీధర్, ఎం పి ఓ బి శ్రీకాంత్ నాయుడు, నరసింహ సాగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రూప్ సింగ్ తదితరులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement