Thursday, May 2, 2024

CM Review Meetings వివిధ శాఖ‌ల స‌మీక్ష‌ల‌తో రోజంతా ముఖ్య‌మంత్రి రేవంత్ బిజిబిజి…

ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.
అలాగే, రైతు భరోసా పథకంపై కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖ అధికారులతో రివ్యూ చేశారు సీఎం.. ఈ సమావేశానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


సచివాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం అధికారులతో.. ఏక్సైజ్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. ఈ మీటింగ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ఉన్నాధికారులు పాల్గొన్నారు.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో ఎక్సైజ్, నార్కోటిక్ డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ చేసింది. నార్కోటిక్ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వాడకంపై గతంలో పలువురు సినిమా ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు.. డ్రగ్స్ వ్యవహారంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసుపై రివ్యూ చేసి వివ‌రాల‌ను తెలుసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement