Tuesday, May 7, 2024

AP: మంగళగిరి వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ

మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేశారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. ఆళ్ల రాజీనామాతో వేగంగా మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు మారుతున్నాయి. మంగళగిరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీ హైకమాండ్ అలెర్ట్ అయింది. సీఎంఓ పిలుపుతో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, గంజి చిరంజీవి క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

ఈ నేపథ్యంలో బీసీ నేత గంజి చిరంజీవికి మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తారని విస్తృతంగా జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. అందుకే గంజి చిరంజీవికి క్యాంపు కార్యాలయం నుంచి పిలుపు వచ్చినట్లు పార్టీ వర్గాల్ల ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలపై సీఎం జగన్‌తో నేతలు భేటీ భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement