Wednesday, May 15, 2024

ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించిన కెసిఆర్

ఢిల్లీలోని వ‌సంత్ విహార్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది. నూత‌నంగా నిర్మించిన బీఆర్ఎస్ భ‌వ‌న్‌ను ఆ పార్టీ అధినేత, ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురువారం మ‌ధ్యాహ్నం 1:05 గంట‌ల‌కు రిబ్బ‌న్ క‌ట్ చేసి భ‌వ‌న్‌లోకి ప్ర‌వేశించారు. భ‌వ‌నం ప్రారంభోత్సవానికి ముందు అక్క‌డ నిర్వ‌హించిన సుద‌ర్శ‌న పూజ‌, హోమం, వాస్తు పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ త‌ర్వాత భ‌వ‌న్ శిలాఫ‌లకాన్ని ఆవిష్క‌రించారు కేసీఆర్. అనంత‌రం మ‌ కేసీఆర్. భ‌వన్‌లో దుర్గామాత అమ్మ‌వారికి కేసీఆర్ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అనంత‌రం మొద‌టి అంత‌స్తులోని త‌న ఛాంబ‌ర్‌లో కేసీఆర్ ఆసీనుల‌య్యారు.
ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు పార్టీ నాయ‌కులు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రులు కేటీఆర్, ప్ర‌శాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశ‌వ‌రావు, వెంక‌టేశ్ నేత‌, సంతోష్ కుమార్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. బీఆర్ఎస్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వం అట్ట‌హాసంగా జ‌రిగింది.
ఇక ఢిల్లీ వసంత్‌ విహార్‌లో బీఆర్‌ఎస్‌ ఆఫీసు నిర్మాణానికి 2021, సెప్టెంబర్‌ 2న సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. మొత్తం నాలుగు అంతస్థులతో 11 వేల చదరపు అడుగుల స్థలంలో దీనిని నిర్మించారు. లోయర్‌గ్రౌండ్‌లో మీడియా హాల్‌, సర్వెంట్‌ క్వార్టర్స్‌ ఉన్నాయి. ఇక గ్రౌండ్‌ఫ్లోర్‌లో క్యాంటీన్‌, రిసెప్షన్‌ లాబీ, 4 ప్రధాన కార్యదర్శుల చాంబర్‌లు, మొదటి అంతస్థులో బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్‌ చాంబర్‌, ఇతర చాంబర్స్‌, కాన్ఫరెన్స్‌ హాల్స్‌, 2వ, 3వ అంతస్థుల్లో మొత్తం 20 గదులు ఉన్నాయి. వీటిలో పార్టీ ప్రెసిడెంట్‌ సూట్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సూట్‌పోగా మిగతా 18 ఇతర రూములు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement