Monday, April 29, 2024

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు.. ఇంటి వ‌ద్దే ఓటు వేసిన 103ఏళ్ల వృద్ధుడు

ఇంటి వ‌ద్ద నుండే ఓటు వేశారు 103ఏళ్ల మ‌హాదేవ మ‌హాలింగ మాలి. ఇంటి నుంచే ఓటు వేశారు. ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆయన ఇంటి వెళ్లగా.. పూర్తి రహస్యంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. ఇందులో భాగంగా బెలగావి జిల్లాలోని చిక్కోడికి చెందిన 103 ఏళ్ల తాత త‌న ఓటుని వినియోగించుకున్నారు.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మేరకు శతాధిక ఓటరుతో ఫోన్‌‌లో మాట్లాడారు. ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయాన్ని వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. యువకులు, పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనడానికి ఇలాంటి వృద్ధ ఓటర్లు ప్రేరణగా నిలుస్తారని సీఈసీ అన్నారు. తనకు ఇంటి నుంచే ఓటు వేసే సౌకర్యం కల్పించినందుకు సీఈసీకి మహాదేవ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో వీల్‌‌చైర్‌‌లో వెళ్లి ఓటు వేశానన్నారు. కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఎన్నికల సంఘం కొత్త సదుపాయం తీసుకొచ్చింది. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు, కరోనాతో బాధపడుతున్నవారు, క్వారంటైన్ లో ఉన్న వారు ఇంటి నుంచే ఓటేసేందుకు వీలు కల్పించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement