Thursday, December 7, 2023

NLG: బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం… కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

మునుగోడు, సెప్టెంబర్ 26 (ప్రభ న్యూస్): రానున్న ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈరోజు మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు 50మంది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు. జరుగుతున్న అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి అందరూ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో భాగస్వాములవుతున్న నాయకులకు అభినందనలు తెలిపారు. పార్టీలో చేరిన వారు పందుల శ్రీను, ఈద రాములు, పోలే రాజు, దుబ్బ రాజశేఖర్, పందుల సైదులు, పందుల రాజు, మల్లేష్, తొలకొప్పుల వెంకులు, ఏర్పుల రేణుక, పాలకూరి ప్రమీల, ఏర్పుల గిరి, కురుమర్తి దిలీప్, పోలే సాయి, కురుమూర్తి చిన్న, చిలుముల వెంకట్, బీసం సైదులు, మునుగోడు వంశీ, అఖిల్, నవీన్, ప్రసాద్, బన్నీ తోపాటు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండ పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీనివాస్, నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, బొడ్డు నాగరాజు గౌడ్, ఈద శరత్ బాబు, పట్టణ అధ్యక్షుడు రావిరాల కుమారస్వామి, మిర్యాల మధుకర్, అల్వాల వెంకన్న, పెరుమళ్ళ ప్రణయ్, ఏర్పుల స్వామి, పందుల పాపయ్యల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement