Saturday, October 12, 2024

Palamneru – చంద్ర‌బాబును వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరుతూ జ‌ల‌దీక్ష‌…

ప‌ల‌మ‌నేరు – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పలమనేర్ పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ పరిధిలోని గొబ్బిళ్ళకోటూరు చెరువులో జల దీక్ష చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గౌడ్ లు ప్రసంగించారు. ధర్మం జైల్లో ఉంటే అధర్మం రాజ్యమేలుతోందని వారు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుట్టీ, ఖాజా పీర్, నాగరాజు,మదన్, శ్రీధర్, వీరప్ప, శ్రీనివాసులు, బాలాజీ, సుబ్రహ్మణ్యం, జగదీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement