Monday, April 29, 2024

ఇద్ద‌రూ యువ‌కులే… తెలంగాణ‌లో తొలిపెళ్లి

ఈ సృష్టిలో ఎన్నో వింత‌లు జ‌రుగుతున్నాయి… అయితే ఇదో ర‌క‌మైన వింత‌.. అదేంట‌నుకుంటున్నారా …? గ‌తంలో ఇద్ద‌రు అమ్మాయిలు పెళ్లి చేసుకోవ‌డం చూశాం..అయితే తెలంగాణ‌లో తొలిసారిగా ఇద్ద‌రు యువ‌కులు పెళ్లి చేసుకోవ‌డాన్ని తొలిసారిగా చూస్తున్నాం. అది కూడా పెద్ద‌ల‌ను ఒప్పించి వారి స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యారు. అయితే తెలంగాణలో తొలిసారిగా ఇద్దరు యువ‌కులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని రికార్డు సృష్టించారు. వివ‌రాల్లోకి వెళ్తే…. 8 ఏళ్ల క్రితం డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన సుప్రియో, అభయ్ మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరిలో సుప్రియో హైదరాబాద్‌లో హోటల్‌ మెనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తుండగా… అభయ్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. ఈ ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యాన్ని వారింట్లో చెప్పారు. అయితే దీనికి ఇరుకుటుంబాల పెద్ద‌లు ఒప్పుకోవ‌డంతో పెళ్లిని గ్రాండ్ గా చేశారు. శ‌నివారం వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. తెలంగాణలోని తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివాహ వేడుకలో సంప్రదాయ బద్ధంగా మంగళస్నానాలు, సంగీత్‌ వంటి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. అయితే ఆ నూత‌న‌ జంట‌ను మీరు క‌న్నులారా వీక్షించండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement