Sunday, April 28, 2024

ADB: ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు…కేంద్ర మంత్రిని క‌లిసిన బీజేపీ ఎమ్మెల్యేలు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఫిబ్రవరి 7(ప్ర‌భ‌న్యూస్‌): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్టు, విమానయాన శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రక్షణ శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారు. ఆదిలాబాద్ లో 360 ఎకరాల స్థలం ఎయిర్ పోర్ట్ కోసం కేటాయించి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్ఓసి ఇప్పించేలా వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారు.

బుధవారం ఢిల్లీలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ఏ మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ను కలిశారు. స్థానిక సమస్యలు అంశాల గురించి వివరించారు. కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలను ముందుగా కేంద్రమంత్రి అభినందించారు. అదిలాబాదులో ప్రతిపాదన దశలోనే ఉన్న ఎయిర్ పోర్టు నిర్మాణo, ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ అకాడమీ సమస్యలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించగా, రక్షణ భద్రత అంశాల వారీగా పరిశీలిస్తే అదిలాబాద్ జిల్లా కేంద్రం అనువుగా ఉందని ముందుగా ఎయిర్ పోర్ట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు విషయంలో దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి వివరించినట్టు బిజెపి ఎమ్మెల్యేలు తెలిపారు. శిక్షణా కేంద్రం ఏర్పడితే ప్రతి ఏటా 15 వేల మంది ఇక్కడే శిక్షణ పొందుతారని, 6 వేల కుటుంబాల కోసం సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లు నిర్మించాల్సి ఉంటుందని తెలిపారు.

- Advertisement -

ఎయిర్‌పోర్ట్ సివిల్ ఆవియేషన్ కు కేంద్రం అనుమతి ఇస్తే విమానాలు కూడా జిల్లా కేంద్రం నుంచి నడపవచ్చని రాష్ట్రం పరిధిలో పెండింగ్లో ఉన్న ఎన్ఓసి ఇప్పించాలని పాయల్ శంకర్ కేంద్రమంత్రికి విన్నవించారు. వెంటనే లేఖ రాస్తామని తమకు హామీ ఇచ్చినట్టు పాయల్ శంకర్ ఆంధ్రప్రభకు వివరించారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను బిజెపి ఎమ్మెల్యేలు కలుసుకొని తమకు నియోజకవర్గాల వారీగా స్పెషల్ ఫండ్ కేటాయించాలని, రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు సంబంధిత అభివృద్ధి పనులకు మంజూరు చేయాలని నిధులు దారిమళ్ళకుండా చూడాలని కోరారు. అనంతరం బిజెపి ఎమ్మెల్యేలు కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిసి ఆదిలాబాద్ జిల్లా సమస్యలు విన్నవించారు. కేంద్ర మంత్రులు తమ సమస్యలు సానుకూలంగా విని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చినట్టు పాయల్ శంకర్ ఆంధ్రప్రభ కు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement