Friday, May 3, 2024

Bigala vs Dhanpal – నీల కంటేశ్వర ఆలయం ముందు టెంట్ వేసుకొని సిద్ధంగా ఉంటా…దన్పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్, (ప్రభ న్యూస్)11: సవాలు విసిరి 24 గంటల సమయం గడిచిన స్పందించే తిరిక మిస్టర్ డేవలప్మెంట్ బిగాలకు లేదా అని బీజేపీ అర్బన్ అభ్యర్థి దన్పాల్ సూర్య నారాయణ అని సూటిగా ప్రశ్నించారు. శనివారం నిజా మాబాదు నగరంలోని వినా యక్ నగర్ 23 వ డివిజన్ లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహిం అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దన్ పాల్ సూర్యనారాయణ మాట్లా డుతూ నా జీవితంలో సంపా దించింది సక్రమంగా కష్ట పడి సంపాదించాననీ అన్నారు. ఈ నెల 13 వ తేదీ ఉదయం 10 గంట లకు నీల కంటేశ్వర ఆలయం ముందు టెంట్ వేసుకొని సిద్ధంగా ఉంటా అన్నారు.

నా సవాల్ ను గణేష్ బిగాలా స్వీకరించాడు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విదంగా పాత కలెక్టర్ కార్యాలయం, ప్రెస్ క్లబ్ దగ్గర స్థలాలు కూల్చారు… కానీ కట్టడాల సంగతి ఏమైంది అని ప్రశ్నిం చారు. నేను కబ్జా చేసింది… రుజువు చేస్తే అందుకు 10 ఇంతలు నిజామాబాదు అర్బన్ అభివృద్ధి కోసం ఖర్చుపెడ్తా అని మరోసారి తెలిపారు. నేను పక్క లోకల్ అని… నువ్వు నాన్ లోకల్ అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

ఈ సమావేశం లో ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి,23 వ డివిజన్ నాయకులు ఎర్రకుంట లక్ష్మణ్, అంత రెడ్డి హరీష్ రెడ్డి, సుధా మాటూరి, శ్రీపాల్ చారి,జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయ ణ,అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement