Thursday, May 2, 2024

బీసీ బంధు ప్రారంభించాలంటూ కేసీఆర్ కు భ‌ట్టి సుధీర్ఘ లేఖ

బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెంటనే బీసీ బంధు పథకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మారేడుగొండలో సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా.. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదని, పీపుల్స్ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం. గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమ పథకాలు అందడం లేదని, తమపట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తమ గోడును బలహీనవర్గాల వారు ‘‘పీపుల్స్ మార్చ్‌’’ పాదయాత్రలో స్వయంగా మమ్మల్ని కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారన్నారు

. బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున మీ దృష్టికి తీసుకుని రాదలచామని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి మీరు, బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుందన్నారు. మీరు హామీ ఇచ్చిన ప్రకారం ఇప్పటికైనా బీసీ బంధు పథకాన్ని ప్రకటించి తగిన నిధులు ఇచ్చి అమలు చేయాలని, అర్హులైన ధరఖాస్తు దారులందరికీ సత్వరమే సబ్బిడీ రుణాలు మంజూరు చేయాల‌న్నారు. 2014, 2018 ఎన్నికలతో పాటు ఇతర సందర్భాల్లో మీరు, బీఆర్‌ఎస్‌ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీని అమలు చేయాలన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల ఉన్న చిన్నచూపును విడనాడలని పక్షంలో బీసీల తరుపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement