Saturday, May 4, 2024

బండి సంజయ్ కాలికి గాయం.. పాదయాత్రపై నో డౌట్స్‌

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుడి కాలికి గాయమైంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా రాత్రి లంగర్ హౌస్ వద్ద ఉన్నప్పుడు గాయమైంది. గత రెండ్రోజులుగా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నడవడంతో కుడికాలి బొటనవేలు చిట్లింది. దీంతో ఆయన నడిచేందుకు కొంచం ఇబ్బంది పడ్డారు. అయితే, డాక్టర్లు ఆయనకు వైద్యం చేశారు. కాలికి గాయం అయినా కూడా తన పాదయాత్రను యాధావిధిగా కొనసాగిస్తున్నారు.  కాగా, బండి సంజయ్ పాదయాత్ర నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఇవాళ మొత్తం 13 కీలో మీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement