Saturday, May 11, 2024

స‌రుకు, సంగ‌తి లేని డ‌బ్బా బ‌డ్జెట్ – బండి సంజ‌య్

హైద‌రాబాద్ – ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన బ‌డ్జెట్ లో స‌రుకు,సంగ‌తి లేని డ‌బ్బా బ‌డ్జెట్ అంటూ తెలంగాణ బిజెపి అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కామెంట్ చేశారు.. తెలంగాణ బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరవైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటల్లో చెప్పాలంటే సరుకు లేదు, సంగతి లేదు. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు. శుష్కప్రియాలు, శూన్యహస్తాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అంతా వట్టిదే, డబ్బా బడ్జెట్, బభ్రాజమానం భజగోవిందం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement