Sunday, April 28, 2024

రంజిత‌మే వీడియో సాంగ్ రిలీజ్

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది వార‌సుడు మూవీ. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో మాత్రం బోల్తా ప‌డింది. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా వారసుడు సినిమాలోని పాటలను ప్రేక్షకులు తెగ ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా ‘రంజితమే’ సాంగ్‌కు ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. థమన్‌ స్వర పరిచిన ఈ పాటకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా ఈ పాట వీడియో సాంగ్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. హీరో విజయ్‌, హీరోయిన్ రష్మిక ఊరమాస్‌ స్టెప్పులు మనల్ని కూడా కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. తమిళంలో ఎమ్‌.ఎమ్‌.మానసితో కలిసి స్వయంగా విజయ్‌ ఆలపించిన ఈ పాటను తెలుగులో అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement