Sunday, May 19, 2024

Crime: చెరువులో న‌వ‌జాత శిశువు మృత‌దేహాం

హైద‌రాబాద్ శివార్ల‌లోని శామీర్‌పేట చెరువులో ఓ న‌వ‌జాత శిశువు మృత‌దేహాం లభ్యం కావడం కలకలం రేపింది. శిశువు మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో చెరువు వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు, శిశువు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి వ‌య‌సు 6 నెల‌లు మాత్ర‌మే ఉంటుంద‌ని పోలీసులు నిర్ధారించారు. అయితే శిశువు బ‌తికి ఉన్న‌ప్పుడే చెరువులో ప‌డేశారా? లేక చంపి మృత‌దేహాన్ని ప‌డేశారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement