Wednesday, May 15, 2024

Breaking: బీజేపీకి బాబూమోహన్ రాజీనామా..

సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజా పరిస్థితులతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

గత కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఆ తర్వాత టికెట్ రావడంతో చల్లబడ్డారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఆయన పార్టీ నుంచి పూర్తిగా తప్పుకోడానికి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement