Monday, April 15, 2024

HYD: రెచ్చిపోయిన చైన్ స్నాచ‌ర్లు.. యువకుడి కళ్ళల్లో కారం చల్లి బంగారు గొలుసు చోరీ..

ఎల్బీనగర్, ఫిబ్రవరి 7 (ప్రభన్యూస్): వనస్థలిపురంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. యువకుడి కళ్ళల్లో కారం చల్లి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం స్టేషన్ పరిధిలోని సాహెబ్ నగర్ పద్మావతి బ్యాంక్ కాలనీ లో బండారి గోవర్ధన్ శ్రీ మహాలక్ష్మి కిరాణం స్టోర్స్​ను నిర్వహిస్తున్నాడు.

బుధవారం ఉదయం పాల ప్యాకెట్ల కోసం రైతుబజార్ వద్దనున్న షాప్ కు వెళ్లి తిరిగి వస్తుండగా కాలనీలో బైక్ పై ఉన్న ఇద్దరు దుండగులు కల్లలో కారం చల్లి మెడలోని బంగారు గొలుసును తెంచుకొని పరారయ్యారు. గోవర్ధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement