Tuesday, May 7, 2024

రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ, పరకాల నియోజకవర్గం నడికుడ మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద రైతులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఒక‌ప్పుడు క‌రెంటు క‌ష్టాల‌కు కార‌ణ‌మే కాంగ్రెస్‌! అస‌మ‌ర్థ‌, దుష్టపాల‌న వ‌ల్ల రైతులు ఆరోజుల్లో అరిగోస ప‌డ్డారన్నారు. అందుకే ఆ పార్టీకి ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడారు. అయినా ఇంకా బుద్ధిరాలేదన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడన్నారు. వ్య‌వ‌సాయానికి కేవలం 3 గంట‌ల క‌రెంటు చాల‌ట‌. ఒక గంట క‌రెంటుతో ఒక ఎక‌రం పారించ‌వ‌చ్చ‌ట‌. వ్య‌వ‌సాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాట‌లేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్య‌ల‌తో రైతులు న‌వ్వుకుంటున్నారన్నారు. న‌వ్వుల‌పాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాల‌ని ప్రజలను ఎమ్మెల్యే కోరారు.

కాళేశ్వ‌రం వంటి గొప్ప ప్రాజెక్టులు క‌ట్టి, రాష్ట్రాన్ని స‌స్య‌శ్యామలం చేసిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కోతలు లేని నాణ్య‌మైన కరెంట్ అందిస్తే పంటలు బాగా పండి, రైతులు సంతోషంగా ఉన్నార‌న్నారు. రైతుల పండించిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ‌మే కొనుగోలు చేస్తూ రాష్ట్రంలో రైతును రాజును చేసిన ఘ‌న‌త సీఎం కెసిఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మ‌గౌర‌వం పెరిగింద‌ని, భూముల విలువలు పెరిగాయని, ఆ విధంగా అనేక చ‌ర్య‌ల‌ను సీఎం కేసీఆర్ తీసుకున్నార‌ని ఎమ్మెల్యే వివ‌రించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టే పరిస్థితి ఉండేది.. నేడు ఆ పరిస్తితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు గంటల కరెంటు చాలంటది.. బీజేపీ మోటార్లకు మీటర్లు పెడతా అంటుంది.. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త.. ఆదమరిస్తే అరిగొస పడుతారు.. నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే కేసీఆర్ వెంట నిలబడాల్సిన సమయం వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంపై విషం జిమ్ముతున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను రాష్ట్రం నుండి తరిమికొట్టాలన్నారు.

స్థానిక రైతులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి తెలియదని, మూడు గంటల విద్యుత్ చాలని చేసిన వాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి అధ్యక్షుడు, సభ్యులు, మార్కెట్, సొసైటీ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement