Thursday, September 21, 2023

TS: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. పొన్నాల లక్ష్మయ్య

గజ్వేల్, సెప్టెంబర్ 14 (ప్రభ న్యూస్) : సీఎం కేసీఆర్ నిజ స్వరూపమేమిటో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసని, మాట మీద లేకుండా దోపిడీ లక్ష్యంగా పనిచేస్తున్న ఏకైక వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలుకు వెళ్లే మొదటి వ్యక్తి కేసీఆర్ అని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం కమిషన్ల కోసం పనులు చేస్తున్నారే తప్ప సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో నిరుపేదల భూములు లాక్కొని అభివృద్ధి చేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి తప్పదన్నారు.

- Advertisement -
   

ఈనెల 17న తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టీ.నర్సారెడ్డి, పీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, సీనియర్ నేత గొల్లపల్లి నరేందర్ రెడ్డి, గజ్వేల్, వర్గల్, కొండపాక, కుక్కునూరు పల్లి, మర్కుక్, తూప్రాన్, ములుగు, మండలపార్టీ అధ్యక్షులు తో పాటు మైనార్టీనేత జాకీర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుంటుకు శ్రీనివాస్, నక్క రాములు గౌడ్, వహిద్ ఖాన్, బాబా, శివారెడ్డి జాంగిర్ హసన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement