Tuesday, November 28, 2023

రూ. 1.8 లక్షల అక్రమ కలప పట్టివేత… ట్రాక్టర్ సీజ్

జన్నారం,జులై 3 ( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా కవ్వాల పులుల అభయారణ్యంలోని రెండు వేరువేరు సంఘటనలో అటవీశాఖ అధికారులు రూ.1.8 లక్ష విలువచేసే అక్రమ టేకు కలపను స్వాధీనం చేసుకున్నారు. అభయారణ్యంలోని ఇందన్ పెళ్లి రేంజ్ కవ్వాల గ్రామ సమీపాన అక్రమ కలప తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ ఆఫీస్ ఉద్దీన్ సోమవారం తెలిపారు. ట్రాక్టర్ లో 6 టేకు దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి, ట్రా క్టర్ సీజ్ చేశామన్నారు. కడెం మండలంలోని ఇస్లాంపూర్ కు చెందిన కనక జైతును అదుపులోకి తీసుకున్నట్లు అని చెప్పారు.

- Advertisement -
   

మరో సంఘటనలో జన్నారం రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రేండ్లగూడ గ్రామ సమీపంలో ఉన్న 6 టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ రెండు సంఘటనలో స్వాధీనం చేసుకున్న అక్రమ టేకు కలప విలువ రూ.180000 లు ఉంటుందన్నారు. ఈ దాడుల్లో డిప్యూటీరేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ,బిట్ ఆఫీసర్లు శ్రీరామ్ నాయక్ ,తిరుపతి, రవి, రంగ శ్రీధర్ గుప్తా, రైమోద్దీన్, రుబీనా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement