Saturday, May 4, 2024

తుగ్లక్ పాలనను అంతం చేయాల్సిందే – టీడీపీ నేతల ప్రతిన


కర్నూలు, జూలై 3,( ప్రభ న్యూస్ బ్యూరో) రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన తుగ్లక్ ను మరిపిస్తుందని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్ లో జిల్లా తెదేపా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముందుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నూతన అధ్యక్షులుగా బీ.టి. నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గముల రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలుగుదేశంపార్టీ కర్నూలు పార్లమెంట్ నూతన అధ్యక్షుడిగా బీ.టి.నాయుడు చేత ప్రమాణ స్వీకారం చేయించారు.


ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పార్టీ నాయకులు, నేతలు, కార్యకర్తలు, వాల్మీకి సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బీటీ నాయుడు ని పూలమాలలతో సత్కరించారు. శాలువాలు కప్పి సన్మానించారు. పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశమునకు కర్నూలు జిల్లాలోని ముఖ్యనాయకులతో పాటు పార్టీ అన్ని స్థాయిల కమిటీల సభ్యులు హాజరయ్యారు. అలాగే పొరుగు జిల్లాకు చెందిన కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జి,అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర పరిశీలకులు హాజరయ్యారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహమునకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ గీతం మా తెలుగు తల్లికి ముల్లెపూ దండ గీతాలాపన చేశారు.

ఈ సందర్భంగా పార్టీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఉద్దేశించి ఉమ్మడి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గముల రాష్ట్ర పార్టీ ఇన్చార్జీ వైకుంఠం ప్రభాకర చౌదరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చూడాలంటే ప్రతి నియోజకవర్గంలో పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో జరిగిన ఎన్నికలకు రానున్న రోజులలో జరుగనున్న ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఇందు కారణం రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి తుగ్లక్ సైకో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. మాజీ కేంద్రమంత్రి , తెదేపా జాతీయ నాయకులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.సి.పి ని ఓడించకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఇక భవిష్యత్ ఉండదన్నారు. అనంతరం వక్తలు తమ సందేశాలలో తెలియపరిచారు.

- Advertisement -

ఈ సమావేశమునకు పోలిట్ బ్యూరో సభ్యులు, అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బీ.కె.పార్థసారధి, జాతీయ పార్టీ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రివర్యులు కె.కె. ప్రభాకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కె. భూపాల్ చౌదరి, పార్టీ నియోజకవర్గం ఇన్చార్జీలు టి.జి.భరత్ (కర్నూలు), కె.ఇ.శ్యాంకుమార్ (పత్తికొండ), ఆకెపోగు ప్రభాకర్ (కోడుమూరు), పి.తిక్కారెడ్డి (మంత్రాలయం), కె.మీనాక్షినాయుడు (ఆదోని), కోట్ల సుజాతమ్మ (ఆలూరు), నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు పి.జి.నరసింహులు, యాదవ్, నంద్యాల నాగేంద్ర, బత్తిన వెంకట్రాముడు, పోతురాజు రవికుమార్, ముఖ్యనాయకులు బీ. వీరభద్ర గౌడ్, ఎం.మల్లిఖార్జున రెడ్డి, వైకుంబం శివప్రసాద్, సాంబశివారెడ్డి, మోమిన్ అహ్మద్ హుస్సేన్, జె.పుష్పావతమ్మ, గుడిశె క్రిష్ణమ్మ, సి.బి.లత, ఎం.అశోక్ కుమార్, పి.జి.గోపినాథ్ యాదవ్, ఎ.వై.ఎస్. బాబు రాజ్, ఆదాం, పరమేశ్, ఆలం నరసానాయుడు, దేవేళ్ళ మురలి, పార్లమెంట్ పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షులు యస్.అబ్బాస్, కె.ఇ.జగదీష్, డి.జేమ్స్, సత్రం రామక్రిష్ణుడు, అల్తాఫ్ హుస్సేన్, ముంతాజ్, పి.హనుమంతరావు చౌదరి, నరసింహులు, బాబు రావు, ఆదిశేషిరెడ్డి, కె.ఉమాపతినాయుడు, దాశెట్టి శ్రీనివాసులు, కోట్ల కవితమ్మ, సాయినందన్, పి.జి.రాంపుల్లయ్య యాదవ్ మొదలగు వారితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement