Thursday, May 2, 2024

పలు సమస్యలపై వినతి పత్రాలు..

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య అధికంగా ఉందని, త్రాగునీటి సమస్యను తీర్చాలని, మంచినీటి సప్లై చేయాలని, సివిల్‌ సప్లై గోదాం వెనుక మున్సిపల్‌ చెత్త డంపింగ్‌ యార్డు, పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంతంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, కబ్జాదారులు ఈ ప్రాంతమంతా కబ్జా చేస్తూ అమ్ముకుంటున్నారని, 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని తహశిల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అధికార, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల అండదండలతోనే ఈభూమి అంతా కబ్జా అవుతుందని, అదేవిధంగా ఎల్లమ్మ టెంపుల్‌ ఏరియా ఇందిరమ్మ కాలనీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, అసలైన లబ్దిదారులకు న్యాయం జరగకుండా అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలని, ఎంపీపీ అక్రమ పట్టాలపై భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని, కన్నాల గ్రామపంచాయితీలో విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుంటున్నారని, 49 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రముఖ వ్యాపార వేత్తకు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి ఏ విధంగా వచ్చిందో రెవెన్యూ అధికారులు తెలుపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఈ విషయాలపై స్థానిక ఆర్డీఓ శ్యామలాదేవికి, మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌కు, డిప్యూటీ తహిశిల్దార్‌ ప్రసాద్‌లకు అఖిలపక్షం నాయకులు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు మత్తమారి సూరిబాబు, గెల్లి జయరాం యాదవ్‌, మణిరాం సింగ్‌, అమానుల్లాఖాన్‌, గుండ మాణిక్యం, గోగర్ల శంకర్‌, ప్రతాప్‌, కాశి సతీష్‌, బత్తుల మధు, మంతెన కొమురయ్య, ఆడెపు మహేష్‌, మారెళ్ల శ్రీనివాస్‌, కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement