Monday, April 15, 2024

రామ‌తీర్ధం హుండీ లెక్కింపులో చేతి వాటం – డిప్యూటీ క‌మిష‌న‌ర్, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ ల‌పై వేటు..

విజ‌యన‌గ‌రం – పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం హుండీ లెక్కింపులో చేతివాటం పై అధికారులు చర్యలు చేపటారు.. ఈ నెల 17 న రామతీర్థం హుండీ లెక్కిస్తుండగా కొంత నగదు, అమ్మవారి బంగారు శతమానం కాజేయటం గుర్తించారు పోలీసులు.. లెక్కింపు సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ కమిషనర్ సుజాత తో ఇతర అధికారులను కూడా ఆరా తీశారు.. జరిగిన చోరీని పోలీసులు సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు.. వెంటనే అక్కడ ఉన్న సిసి కెమెరాలతో పాటు అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి డిప్యూటీ కమిషనర్ కారు డ్రైవర్ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.. వెంటనే అతనిని తనిఖీలు చేయగా కొంత నగదు, బంగారం దొరికింది.. హుండీ లెక్కింపుల్లో జరిగిన చేతివాటం పై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిన పోలీసులు నగదు అపహరణలో డిప్యూటీ కమిషనర్ ఎన్ సుజాత పాత్ర ఉన్నట్లు తేల్చారు.. దింతో డిప్యూటీ కమిషనర్ సుజాతను దేవాదాయ శాఖ అధికారులు సస్పె0డ్ చేశారు.. ఈమెతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే అభియోగంతో జిల్లా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రంగరావుని కూడా సస్పెండ్ చేశారు.. ఘటన లో మరికొందరి పాత్ర పై కూడా ఆరా తీస్తున్నారు.. లెక్కింపుల్లో సరైన జాగ్రత్తలు తీసుకోని రామతీర్థం ఈవో ప్రసాదరావు పై కూడా చర్యలకు సిద్ధమయ్యారు అధికారులు.. ప్రస్తుత్తానికి ఈ అంశం ఇప్పుడు దేవాదాయశాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement