Saturday, April 27, 2024

ఎరువులకు ఇబ్బంది లేదు… జిల్లా వ్యవసాయాధికారి

తాంసి, జులై 7 (ప్రభ న్యూస్) : ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసి మండలంలోని బండల్నాగాపూర్, జామిడి, గ్రామంలో గల ఫర్టిలైజర్ దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల యజమానులకు ఈ సందర్భంగా సూచనలు చేశారు. రైతులకు పిఓఎస్ మిషిన్ ద్వారా మాత్రమే వారి ఆధార్ ని చూసుకున్న తర్వాతనే బయోమెట్రిక్ విధానంలో ఎరువులను అమ్మాలని తెలిపారు.

బండల్నాగాపూర్ రైతు వేదికలో రైతులను ఉద్దేశించి రైతుబంధు అయిదు ఎకరాల లోపు అందరికీ వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని, మిగతా రైతులకు త్వరలోనే వారి ఖాతాల్లో జమవుతుందని తెలిపారు. అనంతరం పాలోడి గ్రామంలో బాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియా వాడకం, దాని ఉపయోగాలపై క్షేత్ర స్థాయిలో ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాంసి మండల వ్యవసాయ అధికారి రవీందర్, వ్యవసాయ విస్తరణ అధికారి శివప్రసాద్, పాలోడి గ్రామ సర్పంచ్ పర్ధాన్ శంకర్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ రైతు సమన్వయ సమితి రైతులు కామ్రే నరేందర్, తిప్పారెడ్డి సతీష్, కళ్లెం నాగిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement